Yuvraj Singh: యువీ సెలెక్ట్ చేసిన టీమ్‌లో ఇండియా నుంచి ఒక్కరికే ఛాన్స్

yuvraj singh selects just one indian in list of first three players to constitute an xi
  • యువీ ప్లేయింగ్ ఎలెవన్ లో భారత్ నుండి ఒక్కరికే ఛాన్స్! 
  • ఓ ప్రత్యేక కార్యక్రమంలో యువరాజ్ సింగ్ షాకింగ్ సమాధానం
  • ధోనీ, విరాట్, రోహిత్‌లను పక్కన పెట్టి జస్‌ప్రీత్ బుమ్రా వైపు మొగ్గుచూపిన యువరాజ్ సింగ్  
భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీమిండియాలో ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ధోనీ రెండు ప్రపంచకప్‌లు అందించగా, కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీ 20 ప్రపంచ కప్ సాధించడంతో పాటు పవర్ హిట్టింగ్‌తో సత్తా చాటుతున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో ఈ త్రయం కూడా ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. అయితే.. భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఈ ముగ్గురు ప్లేయర్స్‌ను విస్మరించాడు. 

ఇటీవల యువరాజ్ సింగ్ (యూవీ) ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో మీరు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకుంటే మొదటి ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అని యువీని ప్రశ్నించగా, యువీ షాకింగ్ సమాధానం ఇచ్చారు. యువరాజ్ తన మొదటి ముగ్గురు ప్లేయర్లలో ధోని, రోహిత్, కోహ్లీలలో ఒక్కరిని కూడా తీసుకోకుండా జస్‌ప్రీత్ బుమ్రా వైపు మొగ్గుచూపాడు. అలానే క్రిస్ గేల్, ఏబీ డివిలియన్స్‌లను మొదటి రెండు స్థానాల్లో తీసుకున్నాడు.
Yuvraj Singh
Sports News

More Telugu News