Viral Video: బ్రూస్ లీ లాగా మారిపోయి ఒక్క తన్ను తన్నిన మహిళ.. ఆ షోను ఎవరు ఎంజాయ్ చేస్తున్నారో చూడండి!

Viral Video Saree Clad Girl Turns Bruce Lee Whos Enjoying the Show
  • రోడ్డు మధ్యలో గొడవ పడిన అమ్మాయిలు
  • గొడవను చూస్తూ ఎంజాయ్ చేసిన ఎలుకలు
  • వైరల్ అవుతున్న వీడియోపై కామెంట్ల హోరు
గొడవలు, వివాదాలు తరచూ వైరల్ అవుతూ సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీస్తూ ఉంటాయి. ఇటీవలి కాలంలో మహిళలు నడిరోడ్డుపై గొడవ పడుతున్న వీడియోలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాంటిదే. కాకపోతే చూస్తున్న ప్రేక్షకులు మాత్రం మనుషులు కాదు. ‘ఘర్ కే కాలేశ్’ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. 

ఆ వీడియో ప్రకారం కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది. సాధారణంగా రోడ్డుపైన ఇలాంటి గొడవలు జరుగుతుంటే చుట్టూ కొందరు గుమికూడి చోద్యం చూస్తారు. కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది.

సమీపంలో ఉన్న మురికి కాలుపై ఉన్న గట్టర్ నుంచి ఎలుకలు వచ్చి ఈ గొడవను ఆసక్తిగా తిలకించాయి. తలలు పైకెత్తి వారి గొడవను చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ కనిపించాయి. గొడవను చిత్రీకరిస్తున్న వ్యక్తి ఎలుకల ఆసక్తికి ముచ్చటపడి వాటిని కూడా వీడియోలోకి తీసుకొచ్చాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 1.8 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు. షేర్లు, కామెంట్లకు లెక్కేలేదు. ఇంకెందుకాలస్యం.. మీరూ ఓ లుక్కేసుకోండి!
Viral Video
Quarrel
Saree Clad Girl
Bruce Lee

More Telugu News