Raghu Rama Krishna Raju: ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ చరిత్రాత్మక నిర్ణయం: రఘురామ

Raghu Rama Krishna Raju opines on IPS officers suspension
  • నటి కాదంబరి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ లపై వేటు
  • కూటమి ప్రభుత్వం ఇలాంటివి సహించదన్న రఘురామ
  • సీఎం మాటల వ్యక్తి కాదు... చేతల వ్యక్తి అని మరోసారి రుజువైందని వెల్లడి
నటి కాదంబరి జెత్వానీపై వేధింపులు, అక్రమ నిర్బంధం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేయడం తెలిసిందే. పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేస్తూ సీఎం చంద్రబాబు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. 

దీనిపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. రాష్ట్రంలో ఒకేసారి ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ చరిత్రాత్మక నిర్ణయం అని అభివర్ణించారు. పోలీసులే అకృత్యాలకు పాల్పడడం దారుణమని, కూటమి ప్రభుత్వం ఇలాంటివి సహించదని పేర్కొన్నారు. 

క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారని రఘురామ వెల్లడించారు. ఏపీ ముఖ్యమంత్రి మాటల వ్యక్తి కాదని, చేతల వ్యక్తి అని మరోమారు రుజువైందని పేర్కొన్నారు.
Raghu Rama Krishna Raju
IPS Officers
Suspension
Kadambari Jethwani
Andhra Pradesh

More Telugu News