SBI: ఎస్‌బీఐలో 1,511 ఖాళీలు.. ప్రారంభమైన దరఖాస్తులు
- 1,511 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న బ్యాంక్
- అక్టోబర్ 4న ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
- షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హుల ఎంపిక
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో 1,511 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌పై (sbi.co.in) ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ అక్టోబర్ 4, 2024 గా ఉంది. అభ్యర్థుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
ఖాళీలు...
- డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డెలివరీ - 187 ఖాళీలు
- డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ఇన్‌ఫ్రా సపోర్ట్, క్లౌడ్ ఆపరేషన్స్- 412 ఖాళీలు
- డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - నెట్‌వర్కింగ్ కార్యకలాపాలు - 80 ఖాళీలు
- డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) – ఐటీ ఆర్కిటెక్ట్ - 27 ఖాళీలు
- డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 7 ఖాళీలు
- అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 784 ఖాళీలు
- అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 14 ఖాళీలు
అర్హతలు...
- డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి బీటెక్/బీఈ/ ఎంసీఏ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి తత్సమానమైన కోర్సులు చేసి ఉండాలి.
- వయో పరిమితి పరిమితి 25 -35 సంవత్సరాల మధ్య ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) పోస్టుకు వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- దరఖాస్తు రుసుము జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.750గా ఉంది. ఎస్‌సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
- దరఖాస్తు చేయాలనుకునేవారు ఇటీవలి దిగిన ఫొటో, సంతకం, రెజ్యూమ్, గుర్తింపు ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ సర్టిఫికేట్, ప్రస్తుతం ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే ఫారం-16/ఆఫర్ లెటర్/పే స్లిప్‌లను దగ్గర ఉంచుకోవాలి.
- సర్టిఫికెట్లు అన్నింటినీ పీడీఎఫ్ ఫార్మాట్ లో సిద్ధంగా ఉంచుకోవాలి.