Pipeline Fire: అమెరికాలో పైప్ లైన్ పగిలి ఎగసిపడుతున్న మంటలు.. వీడియో ఇదిగో!

Pipeline in Houston suburb explodes and is on fire
--
అమెరికాలోని హ్యూస్టన్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. లా పోర్టె సిటీలో పైప్ లైన్ పగిలి మంటలు చెలరేగాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:55 గంటల ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత గాలిలో మంటలు కనిపించాయని స్థానికులు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

మంటలు విస్తరించి పలు విద్యుత్ స్తంభాలు కాలిపోయాయని, చుట్టుపక్కల పలు నివాసాలకు మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లతో నీళ్లు చల్లుతున్నారు. హెలికాఫ్టర్ తో మంటల తీవ్రతను పరిశీలిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు. కాగా, ఆకాశంలోకి ఎగసిపడుతున్న మంటలు చాలా దూరం వరకూ కనిపిస్తున్నాయని లా పోర్టే వాసులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Pipeline Fire
America
Viral Videos
Houston

More Telugu News