Kanaparthi Srinivasa Rao: విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకో: టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు

Kanaparthi Srinivasa Rao warning to Vijayasai Reddy
  • చంద్రబాబుపై ఇటీవల విమర్శలు గుప్పించిన విజయసాయి
  • విజయసాయి ఒక చీటెడ్ అకౌంటెంట్ అన్న శ్రీనివాసరావు
  • జగన్ హయాంలో పని చేసిన అధికారులు విదేశాలకు పారిపోతున్నారని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఒక చీటెడ్ అకౌంటెంట్ అని అన్నారు. జైలు పక్షి విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

జగన్ హయాంలో పని చేసిన పలువురు ఉన్నతాధికారులు, నాయకులు జైలు భయంతో విమానమార్గం, సముద్రమార్గంలో విదేశాలకు పారిపోతున్నారని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారులంతా కేంద్ర కేబినెట్ సెక్రటరీలుగా, సెంట్రల్ ఐటీ చీఫ్ కమిషనర్లుగా పని చేస్తూ ప్రజల్లో గౌరవం పొందుతున్నారని చెప్పారు. చంద్రబాబు కుటుంబానికి, వైఎస్ కుటుంబానికి... ఆదిశంకరాచార్యులుకి, ఆటో శంకర్ కు మధ్య ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు.
Kanaparthi Srinivasa Rao
Chandrababu
Telugudesam
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News