Delta Airlines: లో దుస్తుల విషయంలో సూచనలా..? డెల్టా ఎయిర్ లైన్స్ వివాదాస్పద ఆదేశాలు

Delta Airlines Controversial New Memo For Flight Attendant Applicants
  • ఇంటర్వ్యూకు వచ్చే వారికి ప్రత్యేకంగా మెమో జారీ చేసిన కంపెనీ
  • ఇదెక్కడి వింత అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
  • డెల్టా బ్రాండ్ కాపాడేలా ఉండాలంటూ కంపెనీ వివరణ
ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో చక్కగా, హుందాగా కనిపించేలా డ్రెస్ చేసుకోవడం తప్పనిసరి.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ఈ విషయం తెలిసిందే. ఇంటర్వ్యూకు వెళ్లబోయే కంపెనీని బట్టి ఈ విషయంలో మార్పులు ఉంటాయి. దానికి అనుగుణంగా డ్రెస్ చేసుకుని వెళితే సరిపోతుంది. అయితే, ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఈ విషయంపై చేసిన సూచన ఇప్పుడు ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. డ్రెస్సింగ్ ఎలా ఉండాలనే సూచనలతో పాటు లో దుస్తులు ఎలాంటివి ధరించాలనే విషయంపైనా ఈ కంపెనీ పలు సూచనలు చేయడం విమర్శలకు దారితీసింది. మరీ వాటి గురించి కూడా కండీషన్లు పెడతారా? అంటూ నిరుద్యోగులు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డెల్టా కంపెనీ వివాదాస్పద గైడ్ లైన్స్ ఇవే..
ఫ్లైట్ అటెండెంట్ ఉద్యోగం కోసం వచ్చే అభ్యర్థులు తప్పనిసరిగా పద్ధతిగా డ్రెస్ చేసుకోవాలని డెల్టా కంపెనీ సూచించింది. అభ్యర్థి డ్రెస్సింగ్ ప్రొఫెషనల్ గా హుందాగా ఉండాలని పేర్కొంది. అంతేకాదు, లోదుస్తుల విషయంలోనూ జాగ్రత్త వహించాలని, సరైన అండర్ గార్మెంట్స్ ధరించాలని పేర్కొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ లోదుస్తులు బయటకు కనిపించేలా ఉండకూడదనీ, మహిళా అభ్యర్థులు మరీ కురచ స్కర్టులు ధరించి రాకూడదనీ సూచిస్తూ ‘అప్పియరెన్స్ రిక్వైర్ మెంట్స్ అక్నాలెడ్జ్ మెంట్’ పేరుతో ఓ డాక్యుమెంట్ విడుదల చేసింది. దీనిపై విమర్శలు వ్యక్తం కావడంతో.. తమ కంపెనీ బ్రాండ్ ఇమేజ్ కు భంగం కలిగించకుండా ఉండేందుకే ఈ సూచనలు చేసినట్లు డెల్టా కంపెనీ వివరణ ఇచ్చింది.

మిగతా నిబంధనలు..
  • చేతి వేళ్లు శుభ్రంగా కత్తిరించుకోవాలి, అన్నింటికీ ఒకే రకమైన నెయిల్ పాలిష్ వేసుకోవాలి
  • వేళ్లపై ఎలాంటి పెయింటింగ్ వేసుకోవద్దు
  • మగవాళ్లు ఆఫ్టర్ షేవ్ లోషన్, ఆడవాళ్లు పెర్ ఫ్యూం వాడొచ్చు.. అయితే, లైట్ గా వేసుకోవాలి
  • జుట్టు సహజంగా కనిపించేలా ఉండాలి. రంగు వేసుకున్నట్లయితే సహజత్వానికి దగ్గరగా ఉండేలా చూసుకోవాలి
  • మహిళలు తమ జుట్టును భుజాలు దాటకుండా ఉండేలా చూసుకోవాలి
  • ముక్కుపుడక ఒకవైపు మాత్రమే ఉండాలి
  • రెండు చెవులకూ రెండు రింగులు మినహా ఇతర అలంకరణలు నిషిద్ధం
  • ఆభరణాలు కేవలం బంగారం, వెండి, వజ్రాలకు సంబంధించినవే ఉండాలి. మిగతావేవీ ధరించకూడదు. 
Delta Airlines
Under Garments
Flight Attendant
Job Interview

More Telugu News