Jani Master: జానీ మాస్టర్ గురించి బషీర్ మాస్టర్ ఏమన్నారంటే...!

Basheer Master talks about Jani Master

 


కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు గత రెండు రోజులుగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అలాగే అత్యాచారం కూడా చేశారంటూ ఓ లేడి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరుతున్నారు. తాజాగా కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ ఒక  ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. 

జానీ మాస్టర్ కేసు గురించి బషీర్ మాస్టర్ మాట్లాడుతూ...

 "జానీ మాస్టర్ బిహేవియర్ పరంగా చాలా మంచి వాడు, నేను ఆయనతో కలిసి తిరిగాను. ఆయనతో కలిసి చాలా చోట్ల కొరియోగ్రాఫర్ గా చేయడానికి కూడా వెళ్లాను. నాకు ఆయనతో 15 సంవత్సరాల పరిచయం ఉంది. ఇద్దరం కలిసి నమాజ్ కూడా వెళ్లేవాళ్ళం. ఆయనతో నా ఎక్స్ పీరియన్స్ ఏందంటే ఆయన  హార్డ్ వర్కర్. అలాంటి వాడి గురించి నేను ఇలాంటి విషయం వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఈ విషయం చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. ఏంటి ఇలాంటి వార్త చూశాను అని చాలా బాధేసింది. 

పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే మాటలు కాదు. నేషనల్ అవార్డు కూడా ఈ మధ్య వచ్చింది. అంతా గొప్ప స్థాయికి వెళ్లిన జానీ మాస్టర్ గురించి ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఏది ఏమైనా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.  జానీ మాస్టర్ ఇంతవరకు బయటికి వచ్చి ఎక్కడ ప్రెస్ మీట్ ఇవ్వలేదు. కాబట్టి దాని గురించి మనం ఇప్పుడే మాట్లాడలేము.

షూటింగ్ కి వెళితే అక్కడ, అసిస్టెంట్ ని వేధించేంత టైం ఉండదు. చాలా బిజీగా సాంగ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక సాంగ్ కంపోజిషన్ చేసేటప్పుడు లంచ్ టైంలో రెస్ట్ తీసుకోవడం, నెక్స్ట్ ఏ లొకేషన్ లో షూట్ చేయాలి? అని ఆలోచిస్తుంటారు. అలాంటిది లంచ్ టైం లో జానీ మాస్టర్ అమ్మాయిని ఎక్కువ వేధించేవాడని వినడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏది ఏమైనా కేసు దర్యాప్తు అయితే జరుగుతోంది. ఆ అమ్మాయి చెప్పినట్లు వాళ్ల మధ్య ఏం జరిగిందన్నది బయటికి వస్తే గాని పూర్తిగా తెలియదు. వాళ్ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ఏంటన్నది మనకి తెలీదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడలేము" అని తన అభిప్రాయాన్ని తెలిపారు.

యాంకర్ మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అని అడిగిన ప్రశ్నకి బషీర్ మాస్టర్ మాట్లాడుతూ... "కేసు విచారణలో ఉంది. పోలీసులు ఎవరు తప్పు చేశారన్నది బయటికి తీసుకొస్తారు. ఆ అమ్మాయికి కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వడం లేదంటే తనకు ఏదైనా సహాయం చేయడానికి మేము యూనియర్ తరఫున ముందుకు వస్తాం" అని బషీర్ మాస్టర్ తెలిపారు. బషీర్ మాస్టర్ ఈటీవీలో ప్రసారమైన డి ప్రోగ్రాం తో ఫేమస్ అయ్యారు.

  • Loading...

More Telugu News