Game Changer: రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' రిలీజ్ డేట్ ఇదేనా?

music director thaman given hint about game changer release date
  • గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ పై అప్ డేట్
  • హింట్ ఇచ్చిన చిత్ర సంగీత దర్శకుడు తమన్ 
  • తమన్ ట్వీట్ ను రీపోస్టు చేసిన మూవీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత దిల్‌రాజు వెల్లడించినప్పటికీ తేదీని మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ మూవీ రిలీజ్‌కు సంబంధించి హింట్ ఇచ్చారు. 
 
'వచ్చే వారం నుండి డిసెంబర్ 20 వరకూ ఈవెంట్స్, ప్రచార చిత్రాలుంటాయి. సిద్ధంగా ఉండండి' అంటూ ట్వీట్ చేశారు. దీంతో రామ్ చరణ్ అభిమానులు, సినీ ప్రియులు ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుందంటూ కామెంట్స్ రూపంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమన్ పోస్టును మూవీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రీ పోస్టు చేయడంతో మూవీ రిలీజ్ పై ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చినట్లు అయింది.  
 
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ గేమ్ ఛేంజర్‌లో చరణ్ ద్విపాత్రాభినయం చేసినట్లు సమాచారం. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Game Changer
Ramcharan
Movie News

More Telugu News