Gold Rates: నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
- 24 కేరెట్ల బంగారం ధర గ్రాముపై రూ.80, 22 కేరెట్ల బంగారం ధరపై రూ. 50 తగ్గుదల
- ఢిల్లీలో నేడు 24 కేరెట్ల బంగారం ధర రూ. 73,430
- రూ. 89,500 వద్ద స్థిరంగా వెండి ధర
బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర గ్రాముకు రూ. 80 తగ్గి రూ.7,343కి పడిపోగా, 22 కేరెట్ల ధర రూ.50 తగ్గి రూ. 6,752గా నమోదైంది. గత వారం రోజుల్లో 24 కేరెట్ల బంగారం ధర మైనస్ 0.06 శాతం తగ్గగా, గత నెల రోజుల్లో మైనస్ 0.02 శాతం తగ్గింది. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కేజీ వెండి ధర రూ. 89,500 వద్ద స్థిరంగా ఉంది.
ఢిల్లీలో నేడు పుత్తడి ధర రూ. 73,430గా ఉంది. గతవారం ఈ ధర రూ. 72,890గా ఉండేది. వెండి ధర కిలో రూ. 89,500గా నమోదైంది. గతవారం ఈ ధర రూ. 86,500 ఉంది. చెన్నైలో బంగారం, వెండి ధరలు వరుసగా రూ. 73,310, రూ.95 వేలుగా ఉండగా, ముంబైలో రూ. 74,230, రూ.89,500, కోల్కతాలో రూ. 73,410, రూ. 89,500గా ఉన్నాయి.