Richest and Poorest States: భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితా విడుద‌ల‌.. టాప్‌లో తెలంగాణ‌!

India Richest and Poorest States Check All the Details Here
  • రాష్ట్రాల త‌ల‌స‌రి ఆదాయం ప్రామాణికంగా జాబితాను రూపొందించిన ఈఏసీ-పీఎం
  • ధనిక రాష్ట్రాలుగా టాప్‌-5లో నిలిచిన తెలంగాణ, ఢిల్లీ, హ‌ర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్
  • అత్యంత‌ పేద రాష్ట్రాలుగా బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్
  • ఇండియా జీడీపీలో ఐదు దక్షిణాది రాష్ట్రాలదే సింహభాగం
భార‌త్‌లోని ధ‌నిక‌, పేద రాష్ట్రాల జాబితాను బుధ‌వారం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) విడుద‌ల చేసింది. రాష్ట్రాల త‌ల‌స‌రి ఆదాయం ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించింది.

తలసరి ఆదాయం ప్రకారం ధనిక రాష్ట్రాలు
ఈ నివేదిక ప్రకారం తలసరి ఆదాయం ఆధారంగా .. తెలంగాణ (జాతీయ సగటులో రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయం 176.8 శాతం), ఢిల్లీ (167.5 శాతం), హ‌ర్యానా (176.8 శాతం), మహారాష్ట్ర (150.7 శాతం), ఉత్తరాఖండ్ (145.5 శాతం) భారతదేశంలోని ఐదు అత్యంత ధనిక రాష్ట్రాలు . ఇక ఆ త‌ర్వాతి స్థానాల్లో టాప్‌-10లో.. పంజాబ్ (106 శాతం), గోవా (100.12 శాతం), కేరళ (100.32 శాతం), తమిళనాడు (101.4 శాతం), సిక్కిం (100.51 శాతం) ఉన్నాయి.

కాగా, 2014లో ఏర్పాటైన ఇండియాలోని యంగెస్ట్‌ రాష్ట్రమైన తెలంగాణ ధనిక రాష్ట్రాలలో టాప్‌లో నిల‌వ‌డం విశేషం. అటు ఢిల్లీ, హర్యానా కూడా నిలకడగా మంచి పనితీరు కనబరిచాయి.  

తలసరి ఆదాయం ప్రకారం పేద రాష్ట్రాలు
తలసరి ఆదాయం ప్రకారం భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రాలు.. బీహార్ (జాతీయ సగటులో రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయం 39.2 శాతం), ఉత్తరప్రదేశ్ (43.8 శాతం), మధ్యప్రదేశ్ (46.1 శాతం), రాజస్థాన్ (51.6 శాతం), ఛత్తీస్‌గఢ్ (52.3 శాతం).

ఉత్తరప్రదేశ్, బీహార్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు అయిన్నప్పటికీ, జాతీయ సగటులో వరుసగా 43.8 శాతం, 39.2 శాతాల‌తో అత్యల్ప తలసరి ఆదాయాన్ని కలిగి ఉండ‌డం గ‌మ‌నార్హం.

భారతదేశ జీడీపీలో ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలదే సింహభాగం 
ఐదు దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులు మార్చి 2024 నాటికి భారతదేశ జీడీపీలో 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది 1991లో జాతీయ సగటు కంటే తక్కువ. ఇక దేశపు జీడీపీ టాప్‌ కంట్రిబ్యూటర్‌గా మహారాష్ట్ర కొనసాగుతోంది. అయితే, ఇటీవలి సంవత్సరాలలో ఆ రాష్ట్ర వాటా 15 శాతం నుంచి 13.3 శాతానికి క్షీణించింది.
Richest and Poorest States
India
Telangana
GDP

More Telugu News