Nandigam Suresh: నందిగం సురేశ్ కు మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు

Court imposed 14 days remand for Nandigam Suresh
  • టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం అరెస్ట్
  • ఇటీవల రెండ్రోజుల కస్టడీకి అప్పగించిన కోర్టు
  • కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • అక్టోబరు 3 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇటీవలే నందిగం సురేశ్ ను న్యాయస్థానం రెండ్రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో అతడిని పోలీసులు తాజాగా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నందిగం సురేశ్ కు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. అక్టోబరు 3 వరకు నందిగం రిమాండ్ కొనసాగనుంది. ప్రస్తుతం ఆయన గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

మహిళ మృతి కేసు నిందితుల జాబితాలో నందిగం పేరు!

కాగా, 2021లో తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ మృతి చెందగా, ఈ కేసులోని నిందితుల జాబితాలో పోలీసులు నందిగం సురేశ్ పేరును కూడా చేర్చారు. 

ఈ కేసులో నందిగం సురేశ్ ను అరెస్ట్ చేసేందుకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ పోలీసులు మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం... ముందు ఈ కేసులో నందిగం సురేశ్ పాత్ర ఏమిటో స్పష్టం చేయాలని పోలీసులను ఆదేశించింది.
Nandigam Suresh
Remand
TDP Office

More Telugu News