Harish Rao: రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.1 లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది?: హరీశ్ రావు ప్రశ్న

Harish Rao questions about Kaleswaram scam allegations
  • కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపాటు
  • కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్ నిండుకుండలా ఎలా ఉందని ప్రశ్న
  • కాంగ్రెస్ పార్టీది అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ అని విమర్శ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.93 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందో చెప్పాలన్నారు.

శుక్రవారం నాడు ఆయన మల్లన్న సాగర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాళేశ్వరం కొట్టుకుపోయిందని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారని, ఈ ప్రాజెక్టు నిజంగానే కొట్టుకుపోతే మల్లన్న సాగర్ నిండు కుండలా ఎలా ఉందో చెప్పాలన్నారు. తమ పార్టీది వాటర్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే కాంగ్రెస్ పార్టీది మాత్రం అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ అని చురక అంటించారు.
Harish Rao
Congress
Kaleshwaram Project
BRS

More Telugu News