Gas Leak: గోదావరి నదిలో గ్యాస్ లీక్.. యానాం ప్రజల్లో భయాందోళనలు

Gas Leakage In Godavari River In Andhra Pradesh

  • నదిలో ఓఎన్ జీసీ కంపెనీ పైప్ లైన్
  • నీటిని చీల్చుకుంటూ పైకి వస్తున్న గ్యాస్
  • మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందంటున్న స్థానికులు

గోదావరి నదిలో ఓఎన్ జీసీ చమురు సంస్థ వేసిన పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచి నదిలో నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి ఎగసి వస్తోంది. యానాం దరియాలతిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్యలో ఈ లీకేజీ చోటుచేసుకుంది. చుట్టుపక్కల కిలోమీటర్ల మేర ఈ గ్యాస్ వ్యాపించిందని, మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు, గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. అందువల్ల వెంటనే ఈ గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News