Ganja Chocolates: గంజాయి చాక్లెట్లు.. హైదరాబాద్ లో మళ్లీ కలకలం

Ganja Chocolates Seized In Hyderabad
--
గంజాయిని చాక్లెట్ల రూపంలో తయారుచేసి తరలిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ఘటనలో ఆదిభట్ల ప్రాంతంలో హాష్ ఆయిల్ తరలిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు వివరించారు. ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేసి వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీసులు వెల్లడించారు.

సిటీలో ఇటీవల మత్తుపదార్థాల వాడకం పెరిగిందని, గుట్టుచప్పుడు కాకుండా నగరానికి డ్రగ్స్ రవాణా అవుతున్నాయని తెలిపారు. దీంతో నిఘా పెంచి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. తనిఖీలలో పలుచోట్ల విద్యార్థులు పట్టుబడుతుండడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Ganja Chocolates
Hyderabad
Rachkonda
Drugs

More Telugu News