TTD: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ అత్యవసర భేటీ
- తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారుల సమావేశం
- లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై చర్చ
- ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో చర్చిస్తున్న టీటీడీ ఈఓ శ్యామలరావు
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.
ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో టీటీడీ ఈఓ శ్యామలరావు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని టెస్టుల్లో తేలిందని టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.