Junior NTR: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కృతజ్ఞతలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్

Junior thanks thanks Chandrababu and Pawan Kalyan for giving permission to hike ticket charges for Devara movie
  • ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'దేవర'
  • టికెట్ల ధర, షోల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి
  • విడుదల రోజున 6 షోలకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న 'దేవర' సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి, ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తారక్ ధన్యవాదాలు తెలిపారు. 

"దేవర సినిమా విడుదల కోసం కొత్త జీవోను తీసుకువచ్చినందుకు, తెలుగు సినిమాకు నిరంతర మద్దతు కొనసాగిస్తున్నందుకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు కూడా కృతజ్ఞతలు" అని తారక్ ట్వీట్ చేశారు.

ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా 'దేవర' సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ కు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ. 135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ. 110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ. 60 వరకు పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చింది. 9 రోజుల పాటు రోజుకు 5 షోలను ప్రదర్శించేందుకు పర్మిషన్ మంజూరు చేసింది. విడుదల రోజున 6 షోలకు అనుమతించింది.
Junior NTR
Devara Movie
Tollywood
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News