HYDRA: రేపటి నుంచి మూసీ ప్రక్షాళన... భారీ సంఖ్యలో ఆక్రమణలను తొలగించనున్న హైడ్రా

HYDRA to demolish buildings near Musi

  • హైడ్రాకు ఆక్రమణల తొలగింపు బాధ్యతలు 
  • ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించిన ప్రభుత్వం
  • 12 వేల ఆక్రమణలను గుర్తించిన ప్రభుత్వం

హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగించింది. రేపటి నుంచి ఆక్రమణలను తొలగించనున్నారు. 

మొదటి విడతగా నదీ గర్భంలోని ఆక్రమణలను తొలగిస్తారు. ఆ తర్వాత మిగతా వాటిని తొలగిస్తారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పునరావాసం కల్పించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లిగుడిసెలులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పరిశీలించారు.

వీటిని మూసీ పరివాహక ప్రాంతంలోని వారికి కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాంతంలో 12 వేల ఆక్రమణలను గుర్తించారు. నదీ ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఆక్రణలను తొలగించేందుకు హైడ్రాకు బాధ్యతలు అప్పగించారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ... మూసీ పరీవాహక ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించనున్నట్లు చెప్పారు. మూసీ ప్రక్షాళన, పునఃనిర్మాణాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. 55 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి పనులు సాగుతాయన్నారు.

  • Loading...

More Telugu News