Devara: ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నందమూరి కల్యాణ్ రామ్

devara Producer nandamuri Kalyan Ram thanks to ap govt
  • ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న దేవర
  • టికెట్ల ధర, షోల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
  • రిలీజ్ రోజున ఆరు షోలకు అనుమతించిన ఏపీ సర్కార్
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ దేవర టికెట్ల రేట్లను పెంచుకోవడానికి, ఎక్కువ షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలియజేశారు. తన వ్యక్తిగత ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో కల్యాణ్ రామ్ ..ప్రభుత్వానికి, సీఎం నారా చంద్రబాబునాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. 

ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా దేవర మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ను అందించింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ పై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.110లు, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 9 రోజుల పాటు రోజుకు అయిదు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రిలీజ్ రోజున ఆరు షోలకు అనుమతించింది.
Devara
Nandamuri Kalyan Ram
Movie News

More Telugu News