Devara: ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు... ఎందుకంటే...!

NTR Devara pre release event cancelled due to security reasons
  • ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర
  • ఈ నెల 27న రిలీజ్
  • నేడు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
  • నోవోటెల్ వద్ద గందరగోళం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం దేవర. ఈ చిత్రం సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా... నేడు (సెప్టెంబరు 22) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దయింది. 

నిర్వాహకులు భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ శ్రేయాస్ మీడియా పాస్ లు ఎక్కువ సంఖ్యలో జారీ చేసినట్టు తెలుస్తోంది. దాంతో మాదాపూర్ హైటెక్ సిటీ నోవాటెల్ హోటల్ లో దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం ఏర్పడింది. 

వేలాదిగా అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకువచ్చారు. అభిమానుల అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ లో పాక్షికంగా నష్టం జరిగింది. అభిమానులు ఆడిటోరియం వద్దకు పరుగులు తీసే క్రమంలో భారీ తోపులాట జరిగి పలువురికి గాయాలు అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. 

కెపాసిటీకి మించి పాస్ లు  ఇచ్చిన శ్రేయాస్ మీడియా పై కేసు నమోదు చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో, పోలీసులు అభిమానులను తిప్పి పంపించేస్తున్నారు.
Devara
Pre Release Event
NTR
Koratala Siva
Tollywood

More Telugu News