Gangrape: తమిళనాడులో ఘోరం.. నర్సింగ్ విద్యార్థినిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

Nursing Student Kidnapped GangRaped In Tamil Nadus Dindigul
––
తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. సోమవారం ఓ నర్సింగ్ విద్యార్థినిని దుండగులు ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దిండిగల్ జిల్లా థేనిలో పట్టపగలే ఈ దారుణానికి తెగబడ్డారు. కాలేజీ దగ్గరి నుంచి యువతిని ఎత్తుకెళ్లిన దుండగులు.. గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దిండిగల్ రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు.

బాధితురాలి పరిస్థితి చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు దిండిగల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ దారుణానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
Gangrape
Tamilnadu
Dindigul
Theni
Nursing Student

More Telugu News