AP Wine Shops: ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్

AP Govt to release notification for wine shops in couple of days
  • వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా గత ప్రభుత్వ చట్టం
  • చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం
  • గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం
ఏపీలో కొత్త వైన్ షాపుల నోటిఫికేషన్ కు రంగం సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా గత వైసీపీ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపనుంది. దీనికి రేపే గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 3,736 షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
AP Wine Shops
Notification

More Telugu News