Hyderabad: హైదరాబాద్లో భారీ వర్షం... అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్న జీహెచ్ఎంసీ
- పలు ప్రాంతాల్లో నేలకూలిన చెట్లు
- వర్షం కారణంగా జలమయమైన రోడ్లు
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్లోని పలుచోట్ల సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ గాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అమీర్ పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మాదాపూర్, ఖైరతాబాద్, కూకట్పల్లి సహా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు సూచించారు. ఎమర్జెన్సీ కోసం 040-21111111, 90001 13667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.