Telangana: మేడారం అడవుల్లో ఒకేసారి 50 వేల చెట్లు కూలిపోవడానికి శాస్త్రవేత్తలు చెబుతున్న కారణం ఇదే!

50 thousand trees in 200 hectares are uprooted this is the reason
  • భారీ ఈదురు గాలులు, వర్షానికి మేడారం అటవీ ప్రాంతంలో కుప్పకూలిన 50వేల చెట్లు
  • రెండు ప్రాంతాల్లో వాయుగుండం సంభవించడం వల్ల గంటకు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో గాలులు
  • చెట్ల వేళ్లు భూమిలో లోతుగా కాకుండా అడ్డంగా వెళ్లడం కూడా నేల కూలడానికి కారణమని చెబుతున్న శాస్త్రవేత్తలు
ములుగు జిల్లా ఏటూరునాగారం (మేడారం అటవీ ప్రాంతం) వన్యప్రాణుల అభయారణ్యంలో ఒకేసారి 50వేల చెట్లు నేలకొరిగిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురిసిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పర్యావరణ విపత్తుపై అటవీ ప్రాంతంలో వర్క్ షాపు నిర్వహించారు. ఎన్ఆర్ఎస్‌సీ, ఎన్ఏఆర్ఎల్ కి చెందిన శాస్త్రవేత్తలు .. భారీ ఎత్తున చెట్లు నేల కూలడంపై అధ్యయనం చేశారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో రెండు ప్రాంతాల్లో వాయుగుండం సంభవించడం వల్ల గంటకు 130 నుండి 140 కిలో మీటర్ల వేగంతో గాలి వీచిందని చెబుతున్నారు.

ఆ ప్రాంతంలో గాలులు బలంగా వీచడం వల్ల ఈ విపత్తు జరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. బలమైన మేఘాలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణంగా ఈ ప్రాంతంలో కురిసిన భారీ వర్షపాతం కూడా విపత్తుకు కారణం అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. సారవంతమైన భూమిలో చెట్లు త్వరగా ఎదగడం వల్ల ఈ చెట్ల వేళ్లు భూమిలోకి నిటారుగా కాకుండా అడ్డంగా వెళ్లడం కూడా చెట్లు త్వరగా నేలకొరగడానికి కారణం కావచ్చని అంటున్నారు. దాదాపు 332 హెక్టార్ల విస్తీర్ణంలో 50 వేల చెట్లు నేలకొరిగాయి.
Telangana
Medaram Farest
50 Thousand Trees
Heavy Rains

More Telugu News