Pushpa: అత్యంత కీలకంగా పుష్ప-2 క్లైమాక్స్‌.. అదే రీజన్‌!

Pushpa2 climax is the most important Thats the reason
  • అల్లు అర్జున్‌-ఫహాద్‌లపై చిత్రీకరణ 
  • సినిమాకే హైలైట్ గా ఈ సన్నివేశాలు ‌ 
  • అక్టోబరు నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. పుష్ప ది రైజ్‌ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించడంతో పుష్ప-2పై అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్‌ కంటెంట్‌ టీజర్‌, రెండు సాంగ్స్‌ కూడా అత్యంత ప్రజాదరణ పొందటంతో సినిమా లవర్స్‌కు ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. పుష్ప దిరూల్‌ ఎలా వుండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొని వుంది. డిసెంబరు 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్ననీ, రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ లపై పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఇప్పుడు జరిగే సన్నివేశాలు చిత్రంలో అత్యంత కీలకంగా భావించే పతాక సన్నివేశాల షూటింగ్‌ జరుగుతోందని తెలిసింది. 

పుష్ప మొదటి పార్ట్‌లో హీరో అల్లు అర్జున్‌, నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ మధ్య వచ్చే క్లైమాక్స్‌ సినిమా విజయంలో ఎంత కీలకంగా వుందో అందరికి తెలిసిందే. ఈ పతాక సన్నివేశాలను ఆడియన్స్‌ ఎంతో వైవిధ్యంగా భావించారు. ఇప్పటికీ పుష్ప పార్ట్‌-1 పతాక సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. కాగా పుష్ప-2 ది రూల్‌లో కూడా పతాక సన్నివేశాలు అంతకు మించి హైలైట్‌గా వుంటాయని సమాచారం. ఫహాద్‌ ఫాజిల్‌, అల్లు అర్జున్‌ల నటన, సంభాషణలతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఈ క్లైమాక్స్‌లో కీలకంగా వుండబోతున్నాయట. వచ్చే నెలాఖరు వరకు ఈ చిత్రీకరణ కొనసాగనుంది.
Pushpa
Cinema
Entertainment
Pushpa the rule
Tollywood
Allu Arjun
Sukumar

More Telugu News