Tirumala Laddu: తిరుమల నెయ్యి కల్తీపై వైసీపీ నేత తమ్మినేని కీలక వ్యాఖ్యలు

YCP Leader Tammineni Sitaram Controversial Comments On Tirupati Ghee
  • పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల పాల నుంచి ఆ నెయ్యి తయారు చేసి ఉండొచ్చన్న తమ్మినేని
  • ఆవాలు, అవిశలు, పామాయిలు వంటి వ్యర్థాలను తీసుకునే ఆవుల పాలు కల్తీ అవుతాయన్న వైసీపీ నేత
  • పరీక్షల్లో కచ్చితంగా ఉండవని ఎస్‌డీబీబీ తన నివేదికలో చెప్పిందన్న మాజీ స్పీకర్
తిరుమల శ్రీవారి లడ్డూపై దుమారం కొనసాగుతున్న వేళ.. వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్తీ నెయ్యిగా చెబుతున్నది పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారుచేసే నెయ్యి కావొచ్చని.. ఆవాలు, అవిశలు, పామాయిలు వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారుచేసే నెయ్యి అయి ఉండొచ్చని పేర్కొన్నారు. 

కూటమి నేతలు ఆరోపిస్తున్నట్టు లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటివి లోపలికి అనుమతించింది మీరే అవుతారని విమర్శించారు. పరీక్షల్లో కచ్చితత్వం లోపించే అవకాశం లేకపోలేదని, ఎస్‌డీబీబీ తన నివేదికలో స్పష్టం చేసిందని తెలిపారు. ఎంతో భద్రంగా చేయాల్సిన పనిని అల్లరి చేస్తే మన దేవుడిని మనమే తగ్గించుకోవడం అవుతుందన్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతినే దుస్థితి వచ్చిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirumala Laddu
Ghee
TTD
Tammineni Sitaram
YSRCP

More Telugu News