Mahesh Babu: మహేశ్ బాబు సరసన విదేశీ కథానాయిక

Foreign heroine opposite Mahesh Babu
  • మహేశ్ కు జోడీగా ఇండోనేషియా తార చెల్సియా ఎలిజబెత్‌ 
  • పరిశీలనలో మరో ఇద్దరు విదేశీ హీరోయిన్ల పేర్లు
తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంత మంది కథానాయికలు వచ్చినా స్టార్‌ హీరోల సరసన నాయికల ఎంపిక అనేది ఎప్పుడూ కాస్త జటిలమే. ముఖ్యంగా ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి పెరిగి, మన సినిమాలు పాన్‌ ఇండియాతో విదేశాల్లో కూడా ప్రేక్షకాదరణ పొందటంతో ప్రతి అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా హీరోల సరసన నటించే హీరోయిన్‌ ఎంపిక కూడా ఇప్పుడు ఛాలెంజింగ్‌గానే వుంటుంది. 

ఇప్పుడు ఈ కోవలోనే మహేశ్ బాబు- రాజమౌళి కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో హీరోయిన్‌ కోసం దర్శకుడు రాజమౌళి పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ సినిమాకు అంతర్జాతీయంగా వున్న మార్కెట్‌ ను దృష్టిలో వుంచుకుని మహేశ్ కు జోడీగా ఓ విదేశీ భామను ఎంపిక చేస్తున్నారని తెలిసింది. ఇండోనేషియా హీరోయిన్ చెల్సియా ఎలిజబెత్‌తో పాటు మరో ఇద్దరు ఫారిన్‌ భామల పేర్లు లిస్ట్‌లోకి వచ్చాయి. అయితే ఇంకా ఈ విషయంపై క్లారిటీ రాలేదు. వచ్చే నెలలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
Mahesh Babu
Rajamouli
Cinema
Entertainment
Tollywood
Ssmb29

More Telugu News