Ponguleti Srinivas Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు

ED raids on Telangana minister Ponguleti Srinivas Reddy residence
  • హైదరాబాద్ లోని పొంగులేటి నివాసంలో ఈడీ రెయిడ్స్
  • మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు
  • ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది. పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ 15 ప్రాంతాల్లో శ్రీనివాసరెడ్డికి చెందిన ఫార్మా, రియలెస్టేట్ కంపెనీల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చారు. సీఆర్పీఎఫ్, పోలీసుల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Ponguleti Srinivas Reddy
Congress
Enforcement Directorate

More Telugu News