Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పటినుంచంటే..!

Dussehra Celebrations at Indrakeeladri Temple in Vijayawada

--


దసరా శరన్నవరాత్రి వేడుకలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఘట స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించి తొమ్మిది రోజుల తర్వాత అక్టోబర్ 12న ముగించనున్నారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని రోజుకో అలంకరణలో పూజలు జరపనున్నట్లు ఆలయ పూజారులు తెలిపారు. వేడుకల చివరి రోజు సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందని వివరించారు. 

ఏ రోజు ఏ అలంకారమంటే..
అక్టోబర్‌ 3న బాలాత్రిపుర సుందరీ దేవి
4న గాయత్రీ దేవి
5న అన్నపూర్ణా దేవి
6న లలితా త్రిపుర సుందరీ దేవి
7న మహా చండీ దేవి
8న మహాలక్ష్మీ దేవి
9న సరస్వతీ దేవి
(దుర్గాష్టమి) 10న దుర్గా దేవి
(మహర్నవమి) 11న మహిషాసుర మర్దిని దేవి
(విజయదశమి) 12న ఉదయం మహిషాసుర మర్దిని దేవి, సాయంత్రం రాజరాజేశ్వరి దేవి

  • Loading...

More Telugu News