Devara Movie: 'దేవర' సినిమా చూస్తూ కుప్పకూలిన అభిమాని... మృతి

NTR fan dead while watching Devara movie
  • కడప జిల్లాలో విషాదకర ఘటన
  • ఈలలు, కేకలు వేస్తూ కుప్పకూలిన అభిమాని
  • ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్టు వైద్యుల నిర్ధారణ
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. ఈ సినిమా కోసం ఎంతో ఎదురు చూసిన తారక్ అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. అందరిమాదిరే ఓ అభిమాని కూడా సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఈలలు, కేకలు వేస్తూ సందడి చేస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

ఈ విషాదకర ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడిని మస్తాన్ వలిగా గుర్తించారు. ఆయనది సీకే దిన్నె మండలం జమాల్ పల్లి గ్రామం. ఒక అభిమాని అలా చనిపోవడం అక్కడున్న అందరినీ కలచివేసింది. మస్తాన్ వలి మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Devara Movie
Fan
Dead

More Telugu News