Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిప్పు అంటుకొని 'దేవర' కటౌట్ దగ్ధం

Devara Flexi burnt at Sudarshan theatre
  • దేవర సినిమా విడుదల కావడంతో అభిమానుల సందడి
  • సుదర్శన్ 35 ఎంఎం వద్ద టపాసులు పేల్చిన అభిమానులు
  • కటౌట్‌కు నిప్పు అంటుకొని దగ్ధం
  • రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సుదర్శన్ థియేటర్‌లో జూనియర్ ఎన్టీఆర్‍ 'దేవర' చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు అంటుకుంది. చిరంజీవి నటించిన 'ఆచార్య' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'దేవర'.

ఈ సినిమా ప్రీమియర్ షో గురువారం ఆర్ధరాత్రి ఒంటిగంటకు వివిధ థియేటర్లలో ప్రారంభమైంది. స్టార్ హీరోల సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తుంటారు. సుదర్శన్ 35 ఎంఎం వద్ద కూడా అభిమానులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ కటౌట్‌కు మంటలు అంటుకొని, దగ్ధమైంది.

సమాచారం తెలియగానే అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కటౌట్‌పై ఉన్న పూలదండల మధ్య టపాసులు కాల్చడంతో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు.
Devara
Jr NTR
Telangana
Tollywood

More Telugu News