HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు నోటీసులు

HC issues notices to HYDRA Ranganath
  • అమీన్‌పూర్ చెరువులో భవనం కూల్చివేతపై హైకోర్టుకు బాధితుడు
  • కేసును విచారించిన హైకోర్టు
  • వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరు కావాలని హైడ్రా కమిషనర్ కు ఆదేశాలు
సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసును ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ క్రమంలో రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది.

అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందంటూ ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. అయితే దీనికి సంబంధించి కేసు కోర్టు పరిధిలో ఉందని చెప్పినప్పటికీ హైడ్రా పట్టించుకోకుండా కూల్చివేసిందని బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నేరుగా లేదా ఆన్ లైన్ విచారణకు హాజరు కావాలని తెలిపింది.
HYDRA
Hyderabad
Telangana
Congress

More Telugu News