Viral Videos: భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్న పాక్ చెస్ ప్లేయర్లు... వైరల్ వీడియో ఇదిగో!

In the viral video Pakistan chess team players seen holding Indias flag


ఇటీవలే ముగిసిన చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చిరస్మరణీయ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశ అతిపెద్ద క్రీడా విజయాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయేలా... పురుషుల కేటగిరితో పాటు మహిళల కేటగిరిలోనూ భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 

అరుదైన ఈ డబుల్‌ బొనాంజాను భారత చెస్ ప్లేయర్లు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. టీమిండియా వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఒక వీడియో మాత్రం బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పాకిస్థాన్ చెస్ ప్లేయర్లు భారత జాతీయ పతాకాన్ని పట్టుకున్నారు. భారత జట్టు సభ్యులతో కలిసి నిలబడి త్రివర్ణ జెండాను చేతపట్టారు. దీంతో ఈ వీడియోపై అటు పాకిస్థాన్, ఇటు భారత్ నుంచి స్పందనలు వస్తున్నాయి.

గతంలో ఒకసారి హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-చైనా తలపడ్డాయి. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ హాకీ ఆటగాళ్లు చైనా జెండాను పట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. పాక్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ భారత జెండా పట్టుకున్న పాక్ చెస్ ఆటగాళ్ల విషయంలో అలాంటి విమర్శలు వ్యక్తం కావడం లేదు.

రెండు దేశాల మధ్య సంబంధాలు సానుకూలంగా లేకపోయినప్పటికీ.. క్రీడలు సరిహద్దులకు అతీతంగా కొనసాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కాగా భారత్, పాక్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న నాటి నుంచి ఏ క్రీడ జరిగినా ప్రత్యేకంగా నిలుస్తోంది. క్రికెట్, హాకీ, టెన్నిస్ లేదా ఇతర ఏ క్రీడలైనా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మైదానంలో భారత్, పాక్ ఆటగాళ్లు తలపడుతుందే ఇరుదేశాల అభిమానులు టీవీలకు అతుక్కుపోతున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News