Perni Nani: అన్యమతస్తుడైన ఏపీ గవర్నర్ తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారా .. టీడీపీ, బీజేపీపై మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం

perni nani slams telangana bjp leaders over tirupati laddu row
  • తెలంగాణ బీజేపీ నాయకురాలిపై నాని ఆగ్రహం
  • రైలులో భజన చేసుకుంటూ వచ్చిందంటూ నాని ఫైర్
  • అన్యమతస్థుడిని డిక్లరేషన్ లేకుండా మోదీ ఎలా తీసుకువెళ్లారని బీజేపీ నేతలు ప్రశ్నించారా అంటూ నాని ఆగ్రహం
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ నుండి ఒకామె భజన చేసుకుంటూ తిరుమలకు వచ్చిందని, ఇది దిక్కుమాలిన తనమని దుయ్యబట్టారు. ఆమె ఆసుపత్రిలో భజన చేసుకోవాలని హితవు పలికారు. బిల్లుల పేరుతో ఆసుపత్రిలో దోచుకుంటూ రైలులో భజన చేసుకుంటూ వచ్చిందని, ఆమె ఆసుపత్రిలో హిందువులకు రూపాయి తగ్గించిందా అంటూ మండిపడ్డారు. ఆమె ఆసుపత్రి బాగోతాలు తెలియవా అని ప్రశ్నించారు.

తిరుమల డిక్లరేషన్ పై నాని స్పందిస్తూ గతంలో మోదీతో పాటు ఏపీ గవర్నర్ సైతం తిరుమలకు వెళ్లారని, ఆయన డిక్లరేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. అన్యమతస్థుడిని డిక్లరేషన్ లేకుండా మోదీ ఎందుకు తీసుకువెళ్లారని బీజేపీ నేతలు ప్రశ్నించారా అని నిలదీశారు. హైందవ మతాన్ని, దేవుడిని నమ్మేవాడు బూట్లు వేసుకుని పూజలు చేస్తాడా అని ప్రశ్నించారు. బూట్లు వేసుకుని చంద్రబాబు పూజలు చేశారని, అందుకు సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు. అటువంటి ఆయనను గురించి పవన్ మెచ్చుకోలుగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

హిందూత్వంపై మాట్లాడే బాబు తన తల్లిదండ్రులు చనిపోతే తలవెంట్రుకలు ఎందుకు తీయించుకోలేదని నాని ప్రశ్నించారు. ఎవరు ఏమి పాటిస్తున్నారు.. వారు మాట్లాడుతున్న భాష ఏమిటి అంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్నపై నమ్మకం లేకుండానే జగన్ మెట్లెక్కి నడుచుకుంటూ వెళ్లి దర్శనం చేసుకొని వచ్చారా అని అడిగారు.
Perni Nani
ap news
Chandrababu
pm modi
BJP
TDP
YSRCP

More Telugu News