Tirumala Laddu: దీని అర్థం ఏమిటి చంద్రబాబూ?: జగన్

Jagan counter attack on Chandrababu over Tirumala laddu row
  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్ స్పందన
  • టీటీడీ ఈవో శ్యామలరావు, చంద్రబాబు వ్యాఖ్యల వీడియోలు పంచుకున్న జగన్
  • దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? అంటూ ట్వీట్ 
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియోలు పంచుకున్నారు. 

ఒక వీడియోలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, నెయ్యిలో వనస్పతి వంటి  వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నట్టు వెల్లడైందని వివరించారు. దాంతో, ఆ నెయ్యి సరఫరాదారును బ్లాక్ లిస్ట్ లో ఉంచామని తెలిపారు. రెండు ట్యాంకర్ల నెయ్యిని తిప్పి పంపామని వెల్లడించారు. 

శ్యామలరావు ఈ వ్యాఖ్యలు చేసింది జులై 23వ తేదీ కాగా... సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా జగన్ పంచుకున్నారు. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని చంద్రబాబు పేర్కొనడం ఆ వీడియోలో చూడొచ్చు. 

దీనిపై జగన్ స్పందిస్తూ... దీనర్థం ఏమిటి చంద్రబాబూ? అని ప్రశ్నించారు. దీనికన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.
Tirumala Laddu
Jagan
Chandrababu
TTD
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News