Nagarjuna: సత్యంసుందరం సినిమా చూసి స్పందించిన హీరో నాగార్జున

Brought back so many childhood memories says hero Nagarjuna on SatyamSundaram Movie
  • కార్తి, అరవింద స్వామి మెప్పించారంటూ ప్రశంసలు
  • కార్తిని చూసినంత నవ్వుతూనే ఉన్నానన్న నాగార్జున
  • ఎక్స్ వేదికగా టీమ్ మొత్తాన్ని అభినందించిన టాలీవుడ్ కింగ్
రెండు రోజుల క్రితం థియేటర్లలో విడుదలై విశేషాదరణ పొందుతూ, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటున్న ‘సత్యం సుందరం’ మూవీపై కింగ్ అక్కినేని నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని మెచ్చుకున్నారు.

‘‘డియర్ కార్తీ.. నిన్న రాత్రి సత్యంసుందరం సినిమా చూశాను!!. నువ్వు, అరవింద్ చాలా బాగా మెప్పించారు. సినిమాలో నిన్ను (కార్తీ) చూసి నవ్వుతూనే ఉన్నాను. అదే చిరునవ్వుతో నిద్రపోయాను. ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మనిద్దరం నటించిన ‘ఊపిరి’ సినిమాను కూడా గుర్తుచేసుకున్నాను. హృదయాన్ని హత్తుకునేలా ఉన్న మీ సినిమాపై ప్రేక్షకులు, విమర్శకులు అభినందనలు కురిపిస్తుండడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది!!. చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు’’ అని నాగార్జున పేర్కొన్నారు.

కాగా సత్యం సుందరం సినిమాలో హీరోలు కార్తి, అరవింద స్వామి కీలక పాత్రలు పోషించారు. శ్రీవిద్య, రాజ్‌కిరణ్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు. ఈ సినిమా బావుందంటూ ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మాతలుగా వ్యవహరించారు.
Nagarjuna
SatyamSundaram Movie
Movie News
Tollywood

More Telugu News