Seethakka: మూసీ ఆక్రమణలతో అందరూ ఇబ్బందిపడుతున్నారు: మంత్రి సీతక్క

Minister Seethakka fires at BRS
  • పదేళ్లలో మూసీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వెలిశాయన్న సీతక్క
  • తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
  • చెరువు మధ్యనే ఇళ్లు నిర్మించారన్న మంత్రి
మూసీలో ఆక్రమణలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. గత పదేళ్ల కాలంలో మూసీ పరివాహక ప్రాంతంలో చాలా అక్రమ కట్టడాలు వెళిశాయన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఏం చేసినా ప్రజల కోసమేనని, కానీ బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

మూసీ పరీవాహకంలో కొంతమంది ఏకంగా చెరువు మధ్యనే నిర్మాణాలు చేశారని మండిపడ్డారు. ఇక్కడ ఎక్కువగా నాయకుల భవనాలే ఉన్నాయని, కానీ వాటిని పేదలకు అద్దెకు ఇచ్చినట్లు చెప్పారు. సామాన్యులకు నష్టం కలగకుండా, ఇబ్బందికలగకుండా తాము ముందుకు సాగుతామన్నారు. ఇండ్లు కోల్పోతున్న పేదలకు స్థిర నివాసం కల్పిస్తామన్నారు.
Seethakka
Congress
BRS

More Telugu News