Amazon: ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న అమెజాన్.. జాబ్ వదులుకునేందుకు సిద్ధంగా 73 శాతం మంది ఉద్యోగులు!

Amazon employees want to quit after 5day return to office rule says Survey
  • జనవరి 2 నుంచి తప్పనిసరిగా ఆఫీసుకు రావాలంటూ అమెజాన్ ఆదేశాలు
  • సీఈవో ఆండీ నుంచి ఇలాంటి ఆదేశాలు వస్తాయని ఊహించలేదన్న ఉద్యోగులు
  • గతంలో వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాలన్న ఆదేశాలపైనా గుర్రు
  • అప్పట్లో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న అమెజాన్
  • అమెజాన్ తాజా నిర్ణయంపై 91 శాతం మంది ఉద్యోగుల అసంతృప్తి
వచ్చే ఏడాది జనవరి 2 నుంచి వారంలో ఐదు రోజులు కార్యాలయానికి తప్పనిసరిగా రావాలన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటనపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల్లో 73 శాతం మంది ఉద్యోగాలు వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జాబ్ రివ్యూ సైట్ ‘బ్లిండ్’ సర్వేలో వెల్లడైంది. 2,585 మంది ఉద్యోగులతో మాట్లాడగా వారిలో 91 శాతం మంది ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పేర్కొంది. 

తన కొలీగ్ మరో జాబ్ చూసుకుంటున్న విషయం తమకు తెలుసని 80 శాతం మంది చెప్పగా, ఇప్పటికే కొందరు ఉద్యోగాన్ని వదులుకున్నట్టు 32 శాతం మంది చెప్పారు. అంతేకాదు, జెస్సీ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని ఊహించలేదని చెప్పారు. కాగా, వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాలంటూ గతేడాది ఫిబ్రవరిలో కంపెనీ నుంచి వచ్చిన ఆదేశాలపై అప్పట్లో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని అమెజాన్ రద్దు చేసింది.
Amazon
Work From Home
Amazon Employees
Andy Jassy

More Telugu News