Srinu Vaitla: నాకు నేనే తవ్వుకున్న గొయ్యి .. ఆ సినిమా: శ్రీను వైట్ల!

Srinu Vaitla Interview
  • వాస్తుపై నమ్మకం లేదన్న శ్రీను వైట్ల
  • వేలకోట్ల ఆస్తున్నాయనేది పుకారని వెల్లడి 
  • 'ఆగడు' సినిమా ఫ్లాప్ కి తానే కారణమని వివరణ  
  • 'విశ్వం' హిట్ కొడుతుందని వ్యాఖ్య  

శ్రీను వైట్ల .. ఒకానొక దశలో వరుస సక్సెస్ లను అందుకున్న స్టార్ డైరెక్టర్. ఆ తరువాత కాలంలో అదే స్థాయిలో ఆయనను పరాజయాలు కూడా పలకరించాయి. ఆయన నుంచి సినిమా రాక దాదాపు ఐదేళ్లు అవుతోంది. ఆయన తాజా చిత్రంగా ఈ నెల 11వ తేదీన 'విశ్వం' విడుదల కానుంది. అలాంటి శ్రీను వైట్ల, తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"గోపీచంద్ కి మూడు లైన్స్ చెబితే .. ఈ కథ నచ్చింది. గోపీచంద్ మార్క్ యాక్షన్ తో పాటు, నా మార్క్ కామెడీ టచ్ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది. నేను ఇల్లు మారినప్పుడు నాకు 'వాస్తు'పై నమ్మకం ఎక్కువ అన్నారు. ఫ్లాపులు వచ్చినప్పుడు, రియల్ ఎస్టేట్ పై దృష్టి పెట్టి సినిమాలు పట్టించుకోవడం లేదన్నారు. కానీ నేను వాస్తును గురించి పెద్దగా పట్టించుకోను .. రియల్ ఎస్టేట్ పిచ్చి నాకు లేదు. అందరూ చెప్పుకుంటున్నట్టు నా దగ్గర వేలకోట్లు లేవు" అని అన్నారు. 

"ఇక నేను చేసిన పొరపాటు ఏదైనా ఉందంటే అది 'ఆగడు' సినిమా చేయడమే. నిజానికి ముందుగా అనుకున్న కథ వేరు. కానీ ఆ తరువాత ఆ స్థాయి కథ ఆ నిర్మాతలకు మరింత భారమవుతుందని భావించి, వేరే కథను అనుకున్నాం. ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో కష్టపడ్డాము. కానీ 'దూకుడు' హిట్ తరువాత పెరిగిన అంచనాలను ఈ కథ అందుకోలేకపోయింది. నాకు నేనుగా తీసుకున్న గొయ్యి అది" అని చెప్పారు.

Srinu Vaitla
Gopichand
Vishwam Movie

More Telugu News