Congress: రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాటన్ మిల్లు ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమి
- కల్వకుర్తి స్పిన్నింగ్ మిల్లులో ఎన్నికలు
- కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవి గెలుపు
- 450 ఓట్లకు గాను 251 ఓట్లు పొందిన బీఆర్ఎస్కేవి అభ్యర్థి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ ఎదురైంది! నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని సత్యసాయినగర్ సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం బీఆర్ఎస్కేవీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. ఐఎన్టీయూసీ అభ్యర్థి ఆనంద్కుమార్పై బీఆర్ఎస్కేవీ బలపర్చిన అభ్యర్థి సూర్యప్రకాశ్ రావు కార్మిక సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు.
కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 450 ఓట్లకుగాను 439 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్కేవీ బలపర్చిన అభ్యర్థి సూర్యప్రకాశ్ రావుకు 251 ఓట్లు రాగా, ఆనంద్ కుమార్కు 183 ఓట్లు వచ్చాయి.