venkata reddy: గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి మూడు రోజుల ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతి

former director of mines venkata reddy handed over to acb custody
  • గనుల శాఖలో అవినీతి అక్రమాలపై మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు
  • ఏడు రోజులు కస్టడీ కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ
  • బుధవారం నుండి మూడు రోజుల పాటు కస్టడీ విచారణకు అనుమతి ఇచ్చిన ఏసీబీ న్యాయస్థానం
గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న పిటిషన్‌పై మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో వెంకటరెడ్డిని మూడు రోజుల పాటు ఏసీబీ అధికారుల కస్టడీకి కోర్టు అనుమతి నిచ్చింది. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గనుల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆయనకు రెండు వారాల పాటు రిమాండ్ విధించారు.

కాగా, వెంకటరెడ్డిని ఏడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బుధవారం నుండి మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి నిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
venkata reddy
former director of mines
ACB

More Telugu News