Chandrababu: చంద్రబాబు ఇంటిపై దాడి కేసు .. మాజీ మంత్రి జోగి రమేశ్ కు మరోసారి పోలీసుల పిలుపు

chandrababu home attack case police sent notices to ycp ex minister jogi ramesh

  • చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మరోసారి జోగి రమేశ్‌ను విచారించనున్న పోలీసులు
  • బుధవారం (ఈరోజు) సాయంత్రం నాలుగు గంటల లోపు మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జోగి రమేశ్‌కు నోటీసులు
  • తక్షణ చర్యల నుండి మినహాయింపు ఇచ్చిన సుప్రీం కోర్టు

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల లోపు రావాలని కోరారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే జోగి రమేశ్ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు పోలీసుల విచారణకు జోగి రమేశ్ హాజరయ్యారు. 

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేశ్, దేవినేని అవినాశ్ లు తొలుత ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, వారి పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో వీరు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, భారీ ఊరట లభించింది. జోగి రమేశ్, అవినాష్‌పై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
 
అయితే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వారు విచారణకు హాజరుకాకపోతే తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. పాస్ పోర్టులను పోలీస్ అధికారులకు అప్పగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇంతకు ముందు విచారణకు హాజరైన సందర్భంలో వీరు పాస్ పోర్టులను సరెండర్ చేశారు.

  • Loading...

More Telugu News