Jr NTR: ‘దేవర’ హిట్ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు చిన్న బ్యాడ్ న్యూస్

We sincerely apologize to all the NTR fans for not being able to conduct Success meet
  • సక్సెస్ మీట్‌కు అనుమతులు పొందలేకపోయామన్న నిర్మాత నాగ వంశీ
  • దసరా, దేవీ నవరాత్రుల కారణంగా అనుమతులు దక్కలేదని వెల్లడి
  • క్షమించాలని ఎన్టీఆర్ అభిమానులను కోరిన నిర్మాత
  • అనుమతుల కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నామని వెల్లడి
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, ఇతర నటీనటులు కీలక పాత్ర పోషించిన ‘దేవర’ పార్ట్-1 మూవీ హిట్ టాక్‌తో కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. కాగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అనూహ్యంగా రద్దైన విషయం తెలిసిందే. అయితే సక్సెస్ మీట్ అయినా తమ మధ్య నిర్వహిస్తారని ఆశించిన ఎన్టీఆర్ అభిమానులకు చిన్న బ్యాడ్ న్యూస్ వచ్చింది. భారీ విజయోత్సవ వేడుకను బహిరంగంగా నిర్వహించేందుకు నిరంతరాయంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. దసరా, దేవీ నవరాత్రుల కారణంగా బహిరంగ వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాల అనుమతులు పొందలేకపోయామని చిత్ర నిర్మాత నాగ వంశీ ప్రకటించారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించలేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని తన అభిమానులతో దేవర విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఒక ఈవెంట్‌ను నిర్వహించాలని తారక్ అన్న మొండిగా ఉన్నాడని ఆయన చెప్పారు. అయితే బహిరంగ వేడుక నిర్వహణ తమ నియంత్రణలో లేదని, ఈ ఈవెంట్‌ను నిర్వహించ లేకపోతున్నందుకు అభిమానులు, ప్రేక్షకులు అందరినీ హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నామని నాగ వంశీ ప్రకటించారు. వేడుక నిర్వహణ కోసం తాము ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నామని చెప్పారు. తారక్ అన్నను కొత్త శిఖరాలకు నడిపించే శక్తిగా మీరు అర్థం చేసుకుని కొనసాగుతారని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద దేవర అపూర్వమైన కలెక్షన్ల సునామీ సృష్టించడంలో భాగస్వాములు అయిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు అని ఆయన పేర్కొన్నారు.

దేవర భారీ వసూళ్లు..
భారీ వసూళ్లతో దేవర సినిమా దూసుకెళ్తోంది. విడుదలైన నాటి నుంచి ఆరు రోజుల్లో మొత్తం రూ.396 కోట్లు వసూలు చేసిందని చిత్ర యూనిట్ గురువారం ఉదయం ప్రకటించింది. దేవర ఊచకోతకు బాక్సాఫీస్ షెటర్స్ వణికిపోతున్నాయని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Jr NTR
Devara Movie
success meet
Movie News
Tollywood

More Telugu News