Vinesh Phogat: వినేశ్ ఫొగాట్ నా తండ్రికి కనీసం థ్యాంక్స్ చెప్పలేదు: బబితా ఫొగాట్

Vinesh Phogat thanked everyone except her guru Mahavir Singh
  • వినేశ్ ఫొగాట్ కెరీర్ కోసం నా తండ్రి ఎంతో చేశారన్న బబితా ఫొగాట్
  • పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటు పడినప్పుడు మహావీర్ ఏడ్చాడన్న కూతురు
  • కానీ మొదటి గురువైన నా తండ్రికి థ్యాంక్స్ కూడా చెప్పలేదని ఆవేదన
పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా అనర్హత వేటుకు గురైన వినేశ్ ఫొగాట్‌పై ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ఫొగాట్ కూతురు, మాజీ రెజ్లర్ బబితా ఫొగాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేశ్ ఫొగాట్ పారిస్‌లో ఉండగానే రెజ్లింగ్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. అయితే థ్యాంక్స్ నోట్‌లో చాలామంది పేర్లను ప్రసావించారు. కానీ తన పెదనాన్న, తన మొదటి గురువు మహావీర్ ఫొగాట్ గురించి పేర్కొనలేదు.

ఈ అంశంపై బబితా ఫొగాట్ స్పందించారు. వినేశ్ ఫొగాట్ కెరీర్ కోసం తన తండ్రి మహావీర్ ఫొగాట్ ఎంతో చేశారని, కానీ ఆమె కనీసం కృతజ్ఞతలు తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో కేవలం మూడుసార్లు మాత్రమే తన తండ్రి ఏడవడం చూశానని గుర్తు చేసుకున్నారు.

మొదటిసారి తన, తన సోదరీమణుల పెళ్లిళ్లు జరిగినప్పుడు, రెండోసారి మా బాబాయి చనిపోయినప్పుడు, మూడోసారి వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడినప్పుడు అని వెల్లడించారు. బాబాయి చనిపోయాక వినేశ్ ఫొగాట్, ఆమె సోదరీమణులు రెజ్లింగ్‌ను ఆపేశారని, కానీ నా తండ్రి వారి ఇంటికి వెళ్లి, వాళ్ల అమ్మకు నచ్చజెప్పి రెజ్లర్‌గా తయారు కావడానికి కృషి చేశారన్నారు.
Vinesh Phogat
Babita Phogat
Paris Olympics
Sports News

More Telugu News