Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా

Defamation case registered on Konda Surekha in Nampally court by Nagarjuna
  • నాంపల్లి కోర్టులో కేసు వేసిన అక్కినేని నాగార్జున
  • మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారన్న నాగార్జున
  • సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్ల ఫిర్యాదు
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఆయన ఈ దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నటి సమంత, నాగచైతన్య విడుకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మహిళా కార్పోరేటర్లు మాట్లాడుతూ... నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని, అందుకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Konda Surekha
Akkineni Nagarjuna
Samantha
Naga Chaitanya
Telangana

More Telugu News