Prabhas: పరుచూరి మనవడికి ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రభాస్

Prabhas wishes all the best for Sudarshan Paruchuri on his debut with Mr Celebrity
  • వెండితెరకు పరిచయం అవుతున్న పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు 
  • సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ
  • ట్రైలర్ ఆవిష్కరించిన రానా
  • సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు ప్రభాస్ వెల్లడి 
తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి రచయితలుగా పేరొందిన పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరావు మనవడు సుదర్శన్ పరుచూరి హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం పేరు 'మిస్టర్ సెలెబ్రిటీ'. రవికిశోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి నిన్న ట్రైలర్ రిలీజైంది. నటుడు రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ సినిమా రేపు (అక్టోబరు 4) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ఈ నేపథ్యంలో, మిస్టర్ సెలెబ్రిటీ మూవీ ట్రైలర్ పై అగ్రహీరో ప్రభాస్ స్పందించారు. వెండితెర అరంగేట్రం చేస్తున్న పరుచూరి వారసుడికి విషెస్ తెలియజేశారు. 

"నా మొదటి చిత్రం, మొదటి బ్లాక్ బస్టర్ పరుచూరి వెంకటేశ్వరావు, పరుచూరి గోపాలకృష్ణ నుంచే వచ్చింది. ఇప్పుడు మిస్టర్ సెలెబ్రిటీ చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్న పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు సుదర్శన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. నటుడిగా ఉన్నతస్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఆడియన్స్ కు ట్రైలర్, సినిమా బాగా నచ్చుతాయని భావిస్తున్నాను" అంటూ ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.
Prabhas
Sudarshan Paruchuri
Mr Celebrity
Debut
Trailer
Tollywood

More Telugu News