Narhari Zirwal: సచివాలయంలోని మూడో అంతస్తు నుంచి దూకేసిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్... వీడియో ఇదిగో!
- మరో ఇద్దరు గిరిజన ఎమ్మెల్యేలు కూడా దూకేసిన వైనం
- ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన
- వారిని ఎస్టీల్లో కలపడానికి వీల్లేదంటూ అజిత్ పవార్ వర్గ ఎమ్మెల్యే నిరసన
ఎన్సీపీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ శుక్రవారం మధ్యాహ్నం మహారాష్ట్ర సచివాలయం మూడో అంతస్తు నుంచి దూకేశారు. అయితే ఆయన సేఫ్టీ నెట్స్‌లో పడడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు.
ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్నివ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయనతోపాటు మరో ఇద్దరు గిరిజన శాసనసభ్యులు కూడా దూకేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అక్కడి నుంచి తరలించారు. కాగా, ఈ ఘటనలో కిందికి దూకిన ముగ్గురిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎస్టీల్లో ధంగార్ తెగను చేర్చే అంశం మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. ధంగార్ తెగకు ఎస్టీ రిజర్వేషన్ ను నిరసిస్తూ పలువురు గిరిజన ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవర్ వర్గానికి చెందిన నేత ఆందోళనకు దిగారు. ధంగార్ తెగకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎస్టీ రిజర్వేషన్ కల్పించకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి పెసా (షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీ పొడిగింపు) చట్టం కింద సేవలు అందిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.