YSR District: వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన మంత్రి

Minister Sathya Kumar wrote CM Chandrababu to change YSR District name as YSR Kadapa District
  • గతంలో కడప జిల్లాకు వైఎస్సార్ జిల్లా అని పేరు మార్పు
  • కడప చారిత్రక విశిష్టత ఉన్న ప్రాంతం అని సత్యకుమార్ వెల్లడి
  • అందుకే వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చాలని విజ్ఞప్తి
గతంలో కడప జిల్లాకు 'వైఎస్సార్ జిల్లా' అని పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయితే, వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. కడప పురాణ ప్రాశస్త్యం ఉన్న ప్రాంతమని, ఇక్కడ దేవుని కడప సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమని తెలిపారు. ఇక్కడ స్వామివారు శ్రీలక్ష్మీ సమేతంగా అవతరించి ఉన్నారని వివరించారు. 

తిరుమల వెళ్లే ముందు భక్తులు దేవుని కడప ఆలయంలోని శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయతీగా ఉండేదని సత్యకుమార్ వివరించారు. కానీ గత ప్రభుత్వం అవగాహన లేకుండా 'వైఎస్సార్ జిల్లా' అని పేరు మార్చిందని వెల్లడించారు. ఈ పరిణామంతో వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ, భయం కారణంగా ఎవరూ స్పందించలేకపోయారని తెలిపారు. 

కడప జిల్లా అభివృద్ధికి వైఎస్సార్ చేసిన కృషిని ఎవరూ కాదనలేరని, కానీ చారిత్రక నేపథ్యం దృష్ట్యా ఈ జిల్లాకు 'వైఎస్సార్ కడప జిల్లా' అని పేరు మార్చాలని సత్యకుమార్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.
YSR District
Sathya Kumar
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News