Rajendra Prasad: రాజేంద్రప్రసాద్ కు సానుభూతిని తెలిపిన పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్

Pawan Kalyan and Junior NTR expresses sympathy to Rajendra Prasad
  • గుండెపోటుతో కన్నుమూసిన రాజేంద్రప్రసాద్ కూతురు
  • గాయత్రి మరణం దిగ్భ్రాంతిని కలిగించిందన్న పవన్
  • చాలా విషాదకరమన్న జూనియర్ ఎన్టీఆర్
సీనియర్ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కూతురు గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. కూతురు మరణంతో రాజేంద్రప్రసాద్ కన్నీరుమున్నీరవుతున్నారు. రాజేంద్రప్రసాద్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో జూనియర్ ఎన్టీఆర్ సానుభూతి తెలియజేశారు. 

రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్రప్రసాద్ కు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. 

జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ... తనకు అత్యంత ఆప్తులైన రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం చాలా విషాదకరమని అన్నారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్రప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.
Rajendra Prasad
Pawan Kalyan
Junior NTR
Tollywood

More Telugu News