Jagan: సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారు: జగన్

TDP continues to politicize the Laddu Prasadam issue says Jagan
  • తిరుమల లడ్డూ వ్యవహారంపై జగన్ ట్వీట్
  • లడ్డూ ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తోందని మండిపాటు
  • నిన్న ప్రెస్ మీట్ లో కూడా చంద్రబాబుపై జగన్ విమర్శలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా... తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ రాజకీయాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను ఆయన బీజేపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులకు ట్యాగ్ చేశారు. 

నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు మీకు మొట్టికాయలు వేస్తూ తీర్పును వెలువరించిందని... అయినా సిగ్గు లేకుండా తీర్పును వక్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిందని... అయినా అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతున్నారని దుయ్యబట్టారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దైవ భక్తి ఉండాలని అన్నారు.
Jagan
YSRCP
Telugudesam
Laddu

More Telugu News